ప.గో: చంద్రబాబు పై మాజీ మంత్రి ఫైర్
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర మాజీమంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. ఇవాళ రైతుల పరిస్థితిని వాళ్లకు వాళ్లే వదిలేసే పరిస్థితి ఏర్పరిచారన్నారు. ఇవాళ ఏదైతే ఉచిత బీమా పథకం ఉందో ఆ పథకాన్ని తెలుగుదేశం ప్రభుత్వం పునరుద్ధరించకపోతే రైతుల ఉసురు కొట్టుకుపోతారని ప్రతిఘటించారు. అది ప్రభుత్వానికి మంచిది కాదన్నారు.