మదనపల్లి: కట్నం కోసం వేధిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు
అదనపు కట్నం కోసం వేధిస్తున్న వ్యక్తిపై ఆదివారం కేసు నమోదు చేసినట్లు మదనపల్లి సిఐ కళా వెంకటరమణ తెలిపారు. కురవంకకు చెందిన షేక్ కామ్య భాను(26) కు షేక్ షఫీ తో 2021 లో వివాహం అయింది. వీరికి 18 నెలల కూతురు ఉంది. అదనపు కట్నం కోసం భర్త షఫీ తరచూ వేధిస్తూ ఉండడంతో కామ్య భాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు వరకట్నం కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు.