పొన్నూరు: పది పరీక్ష ఫీజు గడువు పెంపు ఎంఈఓ
వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు ఫీజు చెల్లింపు గడుపును ప్రభుత్వం పొడిగించినట్లు పొన్నూరు మండల ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 26వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. రూ. 50 ఆలస్యం రుసుముతో డిసెంబర్ 2వరకు, రూ. 200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 9 వరకు , రూ. 500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 16 వరకు చెల్లించవచ్చని తెలిపారు.