అద్దంకి: పూజ కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి రవికుమార్
అద్దంకిలోని శ్రీ ధన్వంతరి దత్త పాదు క్షేత్రం నందు ఆదివారం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రత్యేక పూజలు జరిపారు. తొలుత వేద పండితులు ఆయనను సాదరంగా ఆహ్వానించి సత్కరించారు. పూజలు జరిపి స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం పట్టణంలో జరిగిన పలు కార్యక్రమాలలో మంత్రి రవికుమార్ పాల్గొన్నారు.