అద్దంకి మండలం సింగరకొండలోని బాలికల గురుకుల పాఠశాలను శనివారం రాత్రి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ లు సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి ఆహార మెనూ గురించి వారు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు రుచికరమైన పౌష్టిక ఆహారాన్ని అందించాలని మంత్రి బాల వీరాంజనేయ స్వామి పాఠశాల యాజమాన్యానికి సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.