పీలేరు: ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
వాల్మీకిపురం మండలంలో డాటర్ ల్యాండ్స్ రీ-వెరిఫికేషన్ సకాలంలో పూర్తి చేయాలని మదనపల్లె ఇన్ఛార్జి సబ్ కలెక్టర్ రాఘవేంద్ర ఆదేశించారు. వాల్మీకిపురం తహశీల్దార్ కార్యాలయాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి డాటర్ ల్యాండ్స్ రీ-వెరిఫికేషన్ సకాలంలో పూర్తి చేసి నివేదికలు అందజేయాలని సూచించారు. రైతుల భూ సమస్యలను ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు.