పంటల ఈ క్రాప్ నమోదు గడువు పెంపు
నల్లచెరువు మండలంలో ఖరీఫ్ సీజన్ పంటలకు ఈ-క్రాప్ నమోదు గడువును ప్రభుత్వం పొడిగించిందని వ్యవసాయ అధికారులు మంగళవారం తెలిపారు. ఈ నెల 15వతేదీ వరకు గడువు వుండగా తాజాగా ఈ నెల 30వతేదీ వరకు పొడిగించిందన్నారు. ఈ-క్రాప్ నమోదు చేస్తేనే పంటల బీమా అమలవుతుందని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిందన్నారు. పిఎంఎఫ్ బీవై, వాతావరణ ఆధారిత పంటల బీమాను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.