బొమ్మనహాళ్: మట్కా కేసులో నేమకల్లు ఆలయ ధర్మకర్త
ఉమ్మడి జిల్లాతో పాటు పొరుగున ఉన్న కర్ణాటకలోనూ ప్రసిద్ధిగాంచిన నేమకల్లు ఆంజనేయస్వామి క్షేత్ర ధర్మకర్తగా ఉన్న కె. హనుమంతప్ప మట్కా రాస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో శుక్రవారం రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ, బొమ్మనహాళ్ ఎస్ఐ నబీరసూల్ కౌన్సెలింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత టీడీపీకి చెందిన ముఖ్య నాయకులే ఆలయానికి ధర్మకర్తగా ఉండాలంటూ ఒత్తిళ్లు చేశారు.