జగ్గంపేట: మహిళల భద్రత, రక్షణపై అవగాహన కల్పించిన సీఐ
జగ్గంపేట మండలంలోని రాజపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం జగ్గంపేట సీఐ వై ఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉమెన్ పోలీస్, మహిళా రక్షక్ బృందాలతో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, రాగింగ్, పోక్సో చట్టాలు, ఆన్లైన్ మోసాలు, ఫేక్ సోషల్ అకౌంట్ల పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రాజపూడి గ్రామ పెద్దలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.