అవినీతి ఆరోపణలతో అనుమతులు రద్దు
ఏపీ ప్రభుత్వం విశాఖలో శారదా పీఠానికి గత ప్రభుత్వం కేటాయించిన 15 ఎకరాల స్థలాన్ని (విలువ రూ. 220 కోట్లు) కేవలం రూ. 15 లక్షలకు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అనుమతులను రద్దు చేసింది. ఈ ఆరోపణలను సీరియస్గా తీసుకుని కూటమి ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తులో అవినీతి జరిగిందని గుర్తించిన ప్రభుత్వం, తిరుమల కొండపై పీఠం చేపట్టిన నిర్మాణంపై టీటీడీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.