దీపావళి నుంచి మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు దీపావళి నుంచి కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. సోమవారం ఎస్ రాయవరం మండలం ధర్మవరం అగ్రహారం గ్రామంలో నిర్వహించిన 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.