26న విశాఖలో తాగునీటి సరఫరాకు అంతరాయం
విశాఖలోని 8, 9, 10, 11, 12, 20, 22 వార్డుల పరిధిలోని 26వ తేదీన తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని జీవీఎంసీ మంచినీటి సరఫరా విభాగం కార్యనిర్వాహక ఇంజినీరు టి. యల్. సుధాకర్ గురువారం తెలిపారు. సాగర్‌నగర్, గుడ్లవాని పాలెం, ఎండాడ, వివేకానంద నగర్, రాజీవ్ నగర్, ఋషికొండ, పెద్ద రుషికొండ, గాంధీ నగర్, బాలాజీ నగర్, అన్నానగర్ 12వ వార్డు చినగదిలి, పెదగదిలి, సూర్యతేజ నగర్లో సరఫరా ఉండదన్నారు.