అటవీ శాఖ ఆధ్వర్యంలో వేసవి దృష్టిలో ఉంచుకొని అడవికి నిప్పు మానవాళికి మనగడకు పెనుముప్పు అనే నినాదంతో ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో అడవిలో జరిగే అగ్ని ప్రమాదాలపై మంగళవారం ములుగు జిల్లా పస్రాలో ప్రజలకు క్షుణ్ణంగా అవగాహన కల్పించారు. ముఖ్యంగా అడవిలోకి వెళ్లే సమయంలో అగ్నికి కారణమయ్యే వస్తువులు తీసుకెళ్లకుండా జాగ్రత్త వహించాలని ప్రజలకు సూచించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు.