
కోదాడ: సీపీఎం పోరు బాట సర్వే ప్రారంభం
కోదాడ పట్టణంలో ప్రజా సమస్యలపై సీపీఎం పోరాట సర్వే కార్యక్రమాన్ని సోమవారం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, జిల్లా నాయకులు మేదరమట్ల వెంకటేశ్వరరావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక సమస్యలపై సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి ముత్యాలు, నారాయణ, పట్టణ కమిటీ సభ్యులు దాసరి శ్రీనివాసు ఉన్నారు.