సికింద్రాబాద్: పాపం పసివాడు.. కవర్లో తెచ్చి పడేశారు

579பார்த்தது
అప్పుడే పుట్టిన మగ బిడ్డను వదిలేసిన హృదయవిదారక ఘటన అల్వాల్ పీఎస్ పరిధిలో జరిగింది. సోమవారం భూదేవి నగర్ లోని పోచమ్మ ఆలయం వద్ద అప్పుడే పుట్టిన మగ బిడ్డను గుర్తు తెలియని వ్యక్తులు వదిలేశారని అల్వాల్ సీఐ రాహుల్ దేవ్ తెలిపారు. బాలుడిని ప్రథమ చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రికి తరలించామని బాలుడు ఆరోగ్యంగా ఉన్నాడని వెల్లడించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி