2025 -26 విద్యా సంవత్సరానికి గాను ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాలలో 5వ తరగతిలో ప్రవేశానికి, అలాగే ఎస్సీ, ఎస్టీ గురుకులాలలో 6, 7 8, 9 తరగతులలో బ్యాక్‌లాగ్ ఖాళీల ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన టిజీ సెట్- 2025 ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని చర్లపల్లి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో నిర్వహించిన టీజీ సెట్ ప్రవేశ పరీక్షను తనిఖీ చేశారు.