వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు నాంపల్లి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ లో సర్వం సిద్ధమైనట్లు నాంపల్లి ఆర్ఐ దయాకర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మండల వ్యాప్తంగా 33 మంది ఓటర్లు ఉన్నట్లు పోలింగ్ ప్రిసైడింగ్ అధికారి గోగుల సైదులు తెలిపారు. పోలింగ్ బూతు 1078లో మండల వ్యాప్తంగా 33 మంది ఓటర్లు ఉన్నట్లు, అందులో పురుషులు 29, మహిళలు 04 ఓటర్లు ఉన్నట్లు తెలిపారు.