కల్వకుర్తిలోని సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణంలోని సాయి మందిరంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో మొత్తం 450 పేషంట్లను పరీక్షించి బీపీ షుగరు మరియు ఇతరత్రాల అనారోగ్యానికి గురైన వారిని పరీక్షించి వారికి సరిపడా మందులు అందజేయడం జరిగింది. ఈ వైద్య శిబిరం ప్రతినెల రెండవ ఆదివారం కొనసాగుతుంది అని, ఇ క్యాంపులో బిపి షుగర్ ఉన్నవారికీ నెల సరిపడ మందులను ఉచితంగా ఇస్తునట్లు ట్రస్ట్ సభ్యులు తెలియజేశారు.