మద్యం మత్తులో మేయర్ మనవడు ర్యాష్ డ్రైవింగ్.. కేసు నమోదు

56பார்த்தது
మద్యం మత్తులో మేయర్ మనవడు ర్యాష్ డ్రైవింగ్.. కేసు నమోదు
మద్యం మత్తులో మేయర్ మనవడు ర్యాష్ డ్రైవింగ్ చేసిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం మద్యం సేవించిన మేయర్ కేకే మనవడు కారును వేగంగా నడిపి బంజారాహిల్స్‌లో ట్రాలీ ఆటోను ఢీకొట్టాడు. ఈ మేరకు ఫిర్యాదు అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు బ్రీత్ అనలైజర్ టెస్టు నిర్వహించగా.. BAC 150కి పైగా నమోదైంది. ప్రమాదానికి కారణమైన కారును పోలీసులు సీజ్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపట్టారు.

தொடர்புடைய செய்தி