మంచిర్యాల: గ్రామాల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ సోమవారం అన్నారు. మంచిర్యాల కలెక్టర్ కార్యాలయంలో సెంటర్ ఫర్ రోడ్డు రూరల్ మేనేజ్మెంట్ నేషనల్ లెవెల్ మానిటర్స్ సభ్యులతో కలిసి సమావేశం నిర్వహించారు. నేషనల్ లెవెల్ మానిటర్స్ సభ్యులు ఈనెల 15 నుంచి 19 వరకు జిల్లాలోని 4 మండలాల్లోని 10 గ్రామాల్లో పర్యటించి గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించాలన్నారు.