నాగర్ కర్నూల్: సమగ్ర శిక్షా ఉద్యోగుల సమ్మె 24వ రోజు
సమగ్ర శిక్షా ఉద్యోగుల సమ్మె 24వ రోజుకు చేరింది. నాగర్ కర్నూల్ లో అంబేద్కర్ చౌరస్తా వద్ద మానవహారం నిర్వహించారు. సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మురళి, ప్రధాన కార్యదర్శులు ఉమాదేవి, ప్రకాశ్ పాల్గొని మాట్లాడుతూ.. 24 రోజులుగా డీఈఓ, ఎంఈఓ ఆఫీసులు మూతబడి, అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా స్తంభించని తెలిపారు. ప్రభుత్వం స్పందించి వెంటనే సమగ్ర శిక్షా ఉద్యోగులని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.