లక్కీ డ్రాలు నిర్వహిస్తున్న వారిపై కేసు నమోదు: సీఐ
బహమతుల ఆశ చూపెడుతూ లక్కీ డ్రాలు నిర్వహిస్తున్న నిర్వహకులపై కేసు నమోదు చేసినట్లు చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చందుర్తి మండల కేంద్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా దుర్గమ్మ విగ్రహాల వద్ద లయన్స్ యూత్ వారు లక్కీ డ్రా నిర్వహిస్తు ప్రజల వద్దనుండి ఒక్కొక్క లక్కీ డ్రా టికెట్ 99 రూపాయలు వసూలు చేస్తు డ్రాలో పాల్గొనవలసిందిగా ప్రచారం చేస్తున్న వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.