వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో మహా శివరాత్రి జాతర వేడుకలు సోమవారం కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. రాత్రి ఆలయ పార్కింగ్ ప్రాంతంలో శివార్చన అందరిని ఆకట్టుకుంటుంది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో శివార్చన కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలతో, శివనామస్మరణతో మారుమోగుతోంది. ఎటు చూసినా రంగురంగుల విద్యుత్ దీపాలు దర్శనమిస్తున్నాయి.