శివారు గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
మారుమూల గ్రామాలలో మౌలిక సౌకర్యాల కల్పన అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాజశేఖర్ అన్నారు. జన్నారం మండలంలోని అక్కపెళ్లి గూడెంలో సిసి రోడ్డు నిర్మాణ పనులకు ఆయన కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ రాహుల్, వార్డు మెంబర్ గంగన్న, బీసీ సెల్ అధ్యక్షుడు రాజన్న, తదితరులు పాల్గొన్నారు.