మొగల్తూరు: సముద్రం వద్ద పటిష్ట బందోబస్తు
కార్తీక మాసం ఆదివారం కావడంతో మొగల్తూరు మండలం పేరుపాలెం సముద్రం తీరం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నరసాపురం డిఎస్పి శ్రీ వేద ఆధ్వర్యంలో అధికారులతో కలిసి ఆమె తీరప్రాంతాలను పరిశీలించారు. అలాగే సముద్ర స్నానానికి వచ్చే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని సూచించారు.