ఐ. భీమవరంలో ఉద్రిక్తత
ఆకివీడు మండలం ఐ. భీమవరం గ్రామంలో సోమవారం ఉద్రిక్తత నెలకొంది. కాలువ గట్టున ఉన్న ఇళ్లను తొలగించడానికి అధికారులు వచ్చారు. ఈ పనులను వెంటనే ఆపాలంటూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. పోలీసులు, గ్రామస్థుల మధ్య తోపులాట జరిగింది. ఓ మహిళ కింద పడిపోగా ఆమెను ఆసుపత్రికి తరలించారు.