నగరి పట్టణంలో ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి
చిత్తూరు జిల్లా, నగరి పట్టణంలోని బస్టాండ్ క్లాక్ టవర్ వద్ద గురువారం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లా మాట్లాడుతూ దేశ తొలి మహిళ ప్రధానిగా ఇందిరాగాంధీ భారత దేశానికి ఎంతో సేవ చేశారని చెప్పారు. దేశంలో రిజర్వేషన్లు అమలు చేసి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. నేటి మహిళలకు ఇందిరాగాంధీ ఆదర్శమని తెలిపారు.