కొత్తూరు: అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి-ఎమ్మెల్యే
ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందించడం జరుగుతుందని వీటిని 15 రోజుల్లో పరిష్కరించే విధంగా అధికారులు చర్యలకు చేపట్టాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. కొత్తూరు మండల కేంద్రంలో స్థానిక రెవెన్యూ శాఖ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్లో భాగంగా ఆయన పాల్గొన్నారు. ఆయన అర్జీలను స్వీకరిస్తూ లబ్ధిదారులతో ముచ్చటిస్తూ పనులను సాధ్యమైనంత వరకు పరిష్కరించడం జరుగుతుందని స్పష్టం చేశారు.