మనుబోలు: పొదుపు మహిళల డబ్బు స్వాహా
పొదుపు సంఘాల మహిళలను మోసం చేసిన ఘటన మనుబోలు మండలం పరిధిలో వెలుగు చూసింది. మండలంలోని వీరంపల్లి పొదుపు వివో భారతి రూ. 10 లక్షల నగదును స్వాహా చేసింది. గ్రామంలోని 27 గ్రూపులో ఉన్న పలువురు సభ్యులు 50 వేలు రుణం పొంది క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారు. వివో చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు 85 మందికి నోటిసులు పంపించారు. జరిగిన మోసాన్ని తెలుసుకున్న మహిళలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.