విజయవాడ: భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య
నందిగామలో భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విషాదం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నందిగామకు చెందిన శ్రీనివాస్ తో లక్ష్మీ ప్రియాంకతో వివాహమైంది. ఈ క్రమంలో భార్య భర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో నాలుగు రోజుల క్రితం లక్ష్మీ ప్రియాంక పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించింది. దీంతో కాలిన గాయాలైన ఆమె విజయవాడలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది.