భీమవరం: ఉచిత యోగ ధ్యాన శిక్షణ తరగతులు ప్రారంభం
ఆరోగ్యమే మహాభాగ్యమని, యోగాతో మానసిక ప్రశాంతాతని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో సకారాత్మ ఫౌండేషన్ సంకల్ప సమాధి యోగ ఆధ్యాత్మిక ఆరోగ్య సేవా సంస్థ సంకల్ప సమాధి యోగ ఆధ్వర్యంలో ఉచిత యోగ ధ్యాన శిక్షణ తరగతులను ఎమ్మెల్యే ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. యోగాతో శారీరక శ్రమ మాత్రమే కాదని, యోగాతో శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నారు