పులివెందుల: ప్రత్యేకహోదా, స్టీల్ ప్లాంట్ ఊసేలేదు
రాష్ట్రానికి సంజీవిని లాంటి ప్రత్యేకహోదా అమలు, కడప స్టీల్ ప్లాంట్ పై ఊసే లేదని పులివెందుల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ మూలంరెడ్డి దృవకుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం పులివెందుల కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన సందర్భంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకహోదాతో పాటు ఇతర హామీలు ప్రకటించిందన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చి ప్రత్యేకహోదాను నీరుగార్చాయన్నారు.