
తాడికొండ: 'ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధి జర్నలిస్టులు'
ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ డైరీ-2025ని ఏపీ మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి ఆవిష్కరించారు. తాడికొండలో ఆమె మాట్లాడుతూ. జర్నలిస్టులు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పని చేయాలని అభిప్రాయపడ్డారు. ఐ ఎఫ్ డబ్ల్యూ జె రాబోయే రోజుల్లో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణ, చార్లెస్ పాల్గొన్నారు.