పొన్నూరు: మునిపల్లె డీలర్ పై 6ఏ కేసు నమోదు
పొన్నూరు మండలం మునిపల్లె గ్రామంలోని రేషన్ డీలర్ శ్రావణి కార్డుదారులకు సక్రమంగా రేషన్ ఇవ్వకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడంపై తహసిల్దార్ మహమ్మద్ జియావుల్ హక్ కు ఫిర్యాదులందిన నేపథ్యంలో మంగళవారం ఆయన ఎండిఎం వాహనం వద్దకు వెళ్లి తనిఖీ చేశారు. 41 క్వింటాళ్ల రేషన్ బియ్యం వ్యత్యాసం రావడంతో డీలర్ శ్రావణ పై 6ఏ కేసు నమోదు చేశారు. రేషన్ అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు అన్నారు.