నగిరి: తృటిలో తప్పిన పెను ప్రమాదం
చిత్తూరు జిల్లా, నగరి మండల పరిధిలోని తడుకుపేట వద్ద ఆదివారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. వేగంగా వచ్చిన ఓ కారు అదుపు తప్పడంతో కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ప్రమాదం తప్పినట్లు సీఐ మహేశ్, స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.