కార్తీక పౌర్ణమి ప్రాముఖ్యత ఇదే
కార్తీకమాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజున కార్తీక పౌర్ణమి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున పవిత్ర నదులలో స్నానం చేస్తే మోక్షం, లభిస్తుందని సర్వ పాపాల నుంచి విముక్తి లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఆవునేతిలో ఉంచిన 365 వత్తులను దేవుడి ముందు వెలిగించి పాపాలను తొలగించి, ముక్తి ప్రసాదించమని కోరుకుంటారు. రోజంతా ఉపవాసం ఉండి శివాలయం లేదా వైష్ణవ ఆలయంలో దీపాలను వెలిగిస్తారు. ఈరోజు చేసే పుణ్యకార్యాలతో సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం.