ఆడి ఇటలీ అధినేత ఫాబ్రిజియో లాంగో 10,000 అడుగుల పర్వతం నుంచి కిందపడి మరణించాడు. ఇటాలియన్-స్విస్ సరిహద్దుకు సమీపంలోని ఆడమెల్లోని పర్వతాన్ని అధిరోహిస్తున్న సమయంలో 10,000 అడుగుల ఎత్తు నుంచి కిందపడి మరణించారు. ఫాబ్రిజియో లాంగో.. పర్వతానికి చేరువవుతున్న సమయంలో అనుకోని ప్రమాదం జరిగి లోయలోకి పడినట్లు సమాచారం. రెస్క్యూ బృందాలు ఫాబ్రిజియో లాంగో మృతదేహాన్ని 700 అడుగుల లోయలో కనుగొన్నారు.