మ‌హిళా ఫార్మసిస్టుకు సన్మానం

2455பார்த்தது
మ‌హిళా ఫార్మసిస్టుకు సన్మానం
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్, రచయిత, సోషల్ వర్కర్, ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పెండెం కృష్ణకుమార్ శ‌నివారం ఫార్మసిస్ట్ లకు స‌న్మానం చేశారు. ఈ సంద‌ర్భంగా ఫార్మసీస్ట్ జి.దివ్యని మెడికల్ స్టోర్స్ నందు ఘనంగా సన్మానించారు. కృష్ణ కుమార్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో, ఎలాంటి సెలవు తీసుకోకుండా విధులు నిర్వహిస్తున్న ఫార్మసీస్ట్ లకు, కెమిస్ట్ లకు అభినందనలు తెలిపారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సెలవు దినాలు లేకుండా విధులు నిర్వహిస్తున్న వారి సేవలు గొప్పవ‌ని అన్నారు. ఫార్మసిస్ట్ లకు మరియు కెమిస్ట్ ల‌కు ఇన్సూరెన్స్ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி