ట్రంప్ పై హత్యాయత్నం కేసులో అరెస్టైన ర్యాన్ రౌత్ అనే వ్యక్తి ఓ భవన నిర్మాణ కార్మికుడు

72பார்த்தது
ట్రంప్ పై హత్యాయత్నం కేసులో అరెస్టైన ర్యాన్ రౌత్ అనే వ్యక్తి ఓ భవన నిర్మాణ కార్మికుడు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం జరిగింది. ఈ కేసులో అరెస్టైన 58 ఏళ్ల ర్యాన్ వెస్లీ రౌత్ అనే వ్యక్తి మాజీ భవన నిర్మాణ కార్మికుడని మీడియా కథనాలు తెలిపాయి. తాను ఉక్రెయిన్ కు వెళ్లానని, అక్కడ పోరాడేందుకు ఆఫ్గాన్ సైనికులను నియమించాలని అనుకుంటున్నానని 2023లో రౌత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే, అతనికి ఎలాంటి సైనిక నేపథ్యం లేదు. రష్యా, ఉక్రెయిన్ చర్చల ద్వారా యుద్ధాన్ని ఆపాలంటూ ట్రంప్ గతంలో పిలుపునిచ్చారు.

தொடர்புடைய செய்தி