హైదరాబాద్: సెటిల్మెంట్ చేసుకోకుంటే.. నల్లా కనెక్షన్ కట్
హైదరాబాద్: దీర్ఘకాలికంగా పేరుకుపోయిన నల్లా బిల్లులను వసూలు చేసేందుకు జల మండలి అందుబాటులోకి తెచ్చిన ఓటీఎస్ పై జల మండలి స్వరం మార్చింది. బకాయిలు ఉన్న వారినే టార్గెట్గా ప్రత్యేక డ్రైవ్ చేపట్టి, ఈ నెల 30వ తేదీలోగా ఓటీఎస్ సద్వినియోగం చేసుకోవాలని, లేదంటే సంబంధిత నల్లా కనెక్షన్ను తొలగిస్తామని జల మండలి ఈడీ మయాంక్ మిట్టల్ మంగళవారం డివిజన్, రెవెన్యూ అధికారులకు అంతర్గత ఆదేశాలు జారీ చేశారు.