గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికార దాహంతో అవినీతి అక్రమాలకు పాల్పడ్డ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవద్దని మాజీ ఎంపీపీ సాద సుదర్శన్ అన్నారు నిర్మల్ జిల్లా కేంద్రంలో సోమవారం సమావేశం నిర్వహించారు. 30 ఏళ్లుగా అధికారం కోసం పార్టీలు మారే చరిత్ర ఐకే రెడ్డిదని మండిపడ్డారు. భూకబ్జాల మాజీ మంత్రిని పార్టీలో చేర్చుకోవద్దని రాష్ట్రనాయకత్వానికి తీర్మానం చేసి పంపుతామని తెలిపారు.