మహిళా దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సీతక్క
మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో వేడుకలు జరుగనున్న నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రి సీతక్క పరిశీలించారు. సభకు వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు ఉండాలని అధికారులకు సూచించారు. లైటింగ్, తాగునీరు ఇతర సదుపాయాల కల్పనలో ఎక్కడా లోపం లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను అదేశించారు.