అరెస్ట్ చేసిన ఎస్ఎఫ్ఐ నాయకులను విడుదల చేయాలి

70பார்த்தது
అరెస్ట్ చేసిన ఎస్ఎఫ్ఐ నాయకులను విడుదల చేయాలి
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం హైదారాబాద్ లో శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్న ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజును పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఈదునూరి అభినవ్ ఒక ప్రకటనలో ఖండించారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி