కౌశిక్ రెడ్డి ఇంటికి అరికెపూడి.. భారీగా పోలీసులు
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. పార్టీ మారిన బీఆర్ఎస్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి చీర, గాజులు పంపుతామని కౌశిక్ రెడ్డి సవాల్ చేసిన విషయం తెలిసిందే. కాగా, హైదారాబాద్ కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి అరికెపూడి వెళ్తుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా గురువారం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.