కోదాడ మండలం కొమరబండ నేషనల్ హైవే 65 ద్వారకా రెస్టారెంట్ వద్ద లారీ బోల్తా పడినది

425பார்த்தது
కోదాడ మండలం కొమరబండ నేషనల్ హైవే 65 ద్వారకా రెస్టారెంట్ వద్ద మహారాష్ట్రకు చెందిన ఉల్లిగడ్డలను తీసుకు వెళుతున్న లారీ అదుపుతప్పి బోల్తా పడినది. ఉదయం 5 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది ఈ ప్రమాదంలో డ్రైవర్ క్లీనర్ కి తీవ్ర గాయాలు అయినాయి. ఉల్లిగడ్డల వ్యాను బోల్తాపడటంతో అందులో ఉన్న ఉల్లిగడ్డలు మొత్తం కింద పడిపోయినాయి. సమాచారం అందిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డ్రైవర్ క్లీనర్ ని హాస్పటల్కి చికిత్స నిమిత్తం తరలించారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెలలో ఈ ప్రాంతంలో వరుసగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి ద్వారకా రెస్టారెంట్ బారికేడ్లు ఏర్పాటుచేసి ప్రమాదాలను నియంత్రించాలని కోరుతున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி