పెనుమంట్ర: న్యూమేనియాపై అవగాహన కార్యక్రమం
పెనుమంట్రలోని అంగన్వాడీ 3, 8 కేంద్రాలలో మంగళవారం ప్రపంచ న్యూమోనియా దినోత్సవం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఏఎన్ ఎం భాగ్య కుమారి మాట్లాడుతూ పిల్లలలో అధిక దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ వహించకుండా ఆరోగ్య సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ అరుణ, శాంతి, వార్డ్ మెంబెర్ సీహెచ్ దుర్గ, ఆశా సిబ్బంది, ఆయాలు పాల్గొన్నారు