Nov 04, 2024, 06:11 IST/
ఆరోగ్య శ్రీ కార్డు ద్వారా ఉచితంగా పార్శ్వగూని సర్జరీ: నిమ్స్ వైద్యులు
Nov 04, 2024, 06:11 IST
TG: పార్శ్వగూని (స్కోలియోసిస్)తో చాలా మంది బాధపడుతుంటారు. ఇలాంటి వారికి హైదరాబాద్ వైద్యులు శుభవార్త చెప్పారు. పార్శ్వగూనితో బాధపడేవారికి నాణ్యమైన శస్త్రచికిత్స అందించి.. గూనిని పూర్తిగా నయం చేయవచ్చని నిమ్స్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. అయితే కేవలం రూ. ఒక లక్షకే పార్శ్వగూని సర్జరీ చేస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య శ్రీ కార్డు ఉంటే ఉచితంగా ఈ సర్జరీ చేస్తున్నట్లు నిమ్స్ వైద్యులు చెబుతున్నారు.