గజపతినగరం: పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణం దేశానికి తీరని లోటు
భారతదేశ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతి దేశానికి తీరని లోటని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తన సంతాపం వ్యక్తం చేశారు. సామాన్య జీవనాన్ని సాగిస్తూ ఆర్థికంగా బలోపేతం అయిన వ్యక్తి రతన్ టాటా అని కొనియాడారు. వ్యాపారవేత్తలు ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలని పిలుపునిచ్చారు. గొప్ప మానవతా వ్యక్తిని కోల్పోయామని అన్నారు.