ప్రభుత్వ నిబంధనలు పాటించని కళాశాలలపై చర్యలు తీసుకోవాలి
రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని బీఎడ్ కళాశాలలు తప్పుడు ధ్రువపత్రాలతో గుర్తింపు పొందాయని, వెంటనే ఆ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధ్యక్షుడు మహేష్, రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్ర నాయుడు డిమాండ్ చేశారు. యూనివర్సిటీ రిజిస్టర్ వెంకటేశ్వర్లుకి వినతిపత్రం అందజేశారు. బీఎడ్ కళాశాలలు సరైన వసతులు లేకున్నా, తరగతులు సక్రమంగా జరపకున్నా,ఏవిధంగా అనుమతులు ఇచ్చారో అధికారుల నుండి సమాధానం రావాలని శుక్రవారం డిమాండ్ చేశారు.