అవనిగడ్డ: గ్రామ స్వరాజ్య సాధనే కూటమి ప్రభుత్వ ధ్యేయం
గ్రామ స్వరాజ్య సాధనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తనయుడు మండలి వెంకట్రామ్ అన్నారు. గురువారం మోపిదేవి మండలం వెంకటాపురంలో పల్లె పండుగ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధులు రూ. 20లక్షలతో ఏడు సిమెంట్ రోడ్ల నిర్మాణానికి వెంకట్రామ్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సహకారంతో గ్రామాలు అభివృద్ధి చెండుతున్నాయన్నారు.